ఆమెను అమ్మేశాడు.. 

ఇద్దరు మంచి ఈడు జోడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ళ వివాహ జీవితం. కలతలు లేని కాపురం .. వారి ప్రేమకు, పెళ్లి బంధానికి పండంటి పాప పుట్టింది. ఎంతో సంతోషంగా ఉన్న కాపురంలో కలతలు ప్రారంభమయ్యాయి. భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ, ద్వేషంగా మారింది. నిత్యం ఏవో చిన్న చిన్న గొడవలు. ఆ గొడవలు భరించలేని భార్య  పుట్టింటికి వెళ్ళింది.. భర్త వచ్చి తీస్కపోతాడని ఎదురు చూసింది.. అయినా భర్త రాలేదు. ఆ  దూరం ఆ భార్య భర్తల మధ్య మరింత దూరం పెంచింది. 

ఓపెన్ చేస్తే.. ఇంతలో యువతికి గద్దరికి సర్వేశ్ అనే వ్యక్తి వచ్చాడు. తన భర్త పిలుస్తున్నాడని చెప్పడంతో తెలిసిన అన్ననే కదా అని నమ్మింది. అతనితో పాటు వెళ్ళింది. ఆమెను హైదరాబాద్ లోని ఒక రూమ్ లో రెండు రోజులు ఉంచాడు. ఆ తర్వాత అనుమానమొచ్చిన ఆమె సర్వేశ్ ని నిలదీసింది. దీంతో అసలు రంగు బయటపెట్టిన అతడు యువతిని చిత్ర హింసలు పెట్టడం మొదలు పెట్టాడు. ఆమె దగ్గర ఉన్న నగదు, బంగారాన్ని లాక్కుని వ్యభిచారిగా మార్చాడు. రోజూ సిగరెట్లతో కాలుస్తూ వ్యభిచారం చేయాలనీ బలవంత పెట్టాడు..లేకపోతే పాపను చంపేస్తానని బెదిరించాడు. పాపను సైతం వదలకుండా మద్యం మత్తులో ఆమె వీపుపై సిగరెట్లతో కాల్చి రాక్షసానందం పొందేవాడు. ఈ నరకయాతన భరించలేని యువతి అద్దె గది యజమాని సాయంతో అక్కడినుండి బయటపడి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామంలో చోటు చేసుకుంది.