TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కూతురికి  యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని చంపిన తండ్రి.. 

Published on: Tue Jun 15, 2021 9:19AM

చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు. చిన్న పిల్లలు అంటే ఇష్టపడి వారు ఎవరు ఉండరు. ఇక తల్లిదండ్రుల విషయానికి వస్తే పిల్లలే తమ సర్వసవంగా బతుకుతారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వాళ్లకు ఏమైనా తట్టుకోరు. ఇది ఇలా ఉంచితే చాలా మంది జనం ఉన్న చోటు కూడా డ్రైవింగ్ ర్యాష్ గా చేస్తారు.. ఆ ర్యాష్ డ్రైవింగ్ ఎంతో మంది ప్రాణాలను బలికొంది..అలాంటి డ్రైవింగ్ వల్ల ఎలాంటి సంబంధం లేని  సామాన్యులు చాలా మంది పోయారు.. తాజాగా ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఓ కూతురికి దెబ్బలు తగిలాయి.. ఆ కూతురి దెబ్బలు తగలడానికి కారణం అయిన వాడికి చివరికి ఆ తండ్రి ఏంచేశాడో తెలుసా..? ఏం చేశాడో మీరే చూడండి.. తెలుసుకుంది అసలు ఏం జరిగిందో.. 

ఓపెన్ చేస్తే అది హైదరాబాద్ జగద్గిరిగుట్ట.  ఒక పాప రోడ్డు మీద ఆడుకుంటుంది. సడెన్ ఒక బైక్ వచ్చి ఆ పాపను గుద్దేసింది. ఆ పాపకు గాయాలు అయ్యాయి..దీంతో జావేద్ కు పాప తండ్రి శ్రీహరికి మధ్య మాటా మాటా పెరిగింది. ఇద్దరు కూడా రోడ్డు మీద ఘర్షణపడ్డారు. మధ్యాహ్నం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరినీ కూడా బస్తీవాసులు సర్దిచెప్పి పంపించి వేశారు. శ్రీహరి కి తన కూతురు దెబ్బలతో ఉండడం చూడలేకపోయాడు.. ఆవేశపడ్డాడు.. ఆలోచించాడు.. అందుకో ఓ పథకం వేశాడు.  ఆ పధకం ప్రకారమే సాయంత్రం సమయంలో మాట్లాడుకుందామని చెప్పి జావేద్ ఇంటి నుంచి శ్రీ హరి బయటకు తీసుకొచ్చాడు. అప్పటికి మనసులో కుచింతం పెట్టుకున్న శ్రీహరి.. కొద్ది దూరం వెళ్లిన తర్వాత పై జావేద్ పై కత్తితో శ్రీ హరి దాడి చేశారు. తన కూతురికి రోడ్డు ప్రమాదంలో గాయాలపాలు చేసినందుకు జావిద్ పై శ్రీహరి కసి పెంచుకున్నాడు. జావేద్ పై శ్రీహరి దాడి చేస్తున్న ఈ విషయాన్ని వెంటనే స్థానికులు గమనించారు. కత్తితో దాడి చేసి అక్కడి నుంచి శ్రీహరి పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న జావేద్ ను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో జావేద్ మృతి చెందాడు. ఈ సంఘటనపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.