TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోడి బలి... అఘోరీపై కేసు నమోదు 

Published on: Mon Nov 25, 2024 1:56PM

వివాదాస్పద అఘోరీపై మామునూరు పోలీస్ స్టేషణ్ లో కేసు నమోదైంది. నవంబర్ 19న వరంగల్  రంగసాయిపేట బెస్తం చెరువు స్మశానవాటికలో మండుతున్న చితి వద్ద కోడిని  అఘోరీ బలి ఇచ్చింది. జంతుబలి ఇవ్వడం నిషేధం  కాబట్టి  కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. అఘోరీ వింత పూజలు చేస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసిందని  రోహన్ రెడ్డి ఆరోపించారు. 
తెలంగాణ యానిమల్స్ అండ్ బర్డ్స్ సాక్రిఫై యాక్ట్ క్రింద కేసు నమోదు చేయాలని రోహన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే స్మశాన వాటికలో వింత పూజలు చేస్తూ చితి మీదే పడుకోవడం ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయడమేనని రోహన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. నన్నెవరూ ఏమీ చేయలేరని ఇప్పటి వరకు అఘోరీ చెబుతూ వస్తోంది. కానీ రోహన్ రెడ్డి ఫిర్యాదుచేయడంతో   అఘోరీపై తెలుగు రాష్ట్రాల్లో మొదటి కేసు నమోదైందని చెప్పొచ్చు