కూలిపోయిన సీబీఎస్
Published on: Fri Jul 6, 2018 11:33AM

సీబీఎస్.. ఎప్పుడో 1930లో నిజాం కాలంలో దీన్ని విమానాల హ్యాంగర్‌గా నిర్మించారు.. తరువాత 1951లో హ్యాంగర్‌ను ఆర్టీసీ అధీనంలోకి తీసుకుంది.. అప్పటినుండి రాష్ట్ర ప్రధాన బస్టాండ్ గా, జిల్లా బస్సులకు ఆశ్రయంగా, గత పన్నెండేళ్లుగా సిటీ బస్‌స్టేషన్‌గా సేవలు అందిస్తోంది.. అంతటి చరిత్ర ఉన్న సీబీఎస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.. జూన్ 30 నుంచి సీబీఎస్ లో సిటీ సర్వీసుల రాకపోకలు నిలిపేశారు.. రెండు గేట్లు మూసివేశారు.. డోమ్‌కు బిగించిన ఇనుప బొల్టులు తుప్పు పట్టాయని, కూలి ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని గుర్తించి బస్సుల రాకపోకలను నిలిపేశామని, షాపులను ఖాళీ చేయించామని ఆర్టీసీ అధికారులు చెప్పారు.. గురువారం ఉదయం సీబీఎస్ డోమ్ పెద్ద శబ్దంతో కుప్పకూలిపోయింది.. చరిత్ర పుటల్లోకి చేరిపోయింది.


