టీడీపీకి షాక్.. వైసీపీలో చేరేందుకు 8 మంది ఎమ్మెల్యేలు సిద్ధం
Published on: Fri Jun 14, 2019 11:19AM

టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా అలంటి వ్యాఖ్యలే చేశారు. 8 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్‌లో ఉన్నారని కోటంరెడ్డి బాంబు పేల్చారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కూడా 2 నెలల నుంచి మాతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. 8 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు నేరుగా తనతో మాట్లాడుతున్నట్లు ప్రకటించారు. జగన్ ఓకే అంటే సాయంత్రమే కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో అనేక మంది టీడీపీ నేతలు వైసీపీతో సంబంధాలు కొనసాగిస్తున్నారని వివరించారు. అందరూ వచ్చేందుకు సిద్ధమని చెబుతున్నారన్నారు. టీడీపీకి భవిష్యత్ లేదని వారంతా నమ్ముతున్నారన్నారు.


