TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

21 రోజుల పసిబిడ్డ గర్భం లో 8 పిండాలు

Published on: Sat Nov 5, 2022 12:39PM

రాంచీ రాంఘర్ లో దంపతులు తమ నవజాత శిశువు ఏడుపు తట్టుకోలేక ఆస్పత్రికి తీసికెళ్లారు. పసి కందు కడుపునొప్పితో బాధపడుతోందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. పరీక్షించగా ఆశర్యర్యకర సంగతి తెలిసింది. వైద్యులు స్కానింగ్‌ తీయగా.. శిశువు కడుపులో కణితి ఉన్నట్లు భావించారు. ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఈ నెల 1వ తేదీన ఆపరేషన్‌ చేయగా.. వైద్యులకు శిశువు కడుపులో కణితి బదులు 8 పిండాలు కనిపించాయి. ఇదెలా సాధ్యమని డాక్టర్లు కుటుంబసభ్యులు, బంధువులు అంతా విస్తు పోయారు. పసికందు ప్రాణాలతో గట్టెక్కు తుందా అని భయపడ్డారు. పసికూన సురక్షితంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

పసికందు గర్భంలో 8 పిండాలు ఎక్కడైనా కన్నామా విన్నామా? ప్రపంచంలోనే అరుదైన ఘటనగా నిపు ణులు పేర్కొంటున్నారు. దీనిని వైద్య పరిభాషలో ఫిఫ్ అంటారు. అంటే పిండంలో పిండం ఉండటం. ఇది ప్రపచంలోనే అరుదైన ఘటన స్థితిగా పేర్కొన్నారు. అదీకాక వెన్నుపూసలో పిడం ఉండ డం డాక్టర్స్ గుర్తించారు. ఇప్పటిదాకా ప్రపంచలో ఇలాంటి అరుదైన కేసులు 200లోపే వెలుగు చూశా యని.. భారత్‌లో 10 మాత్రమే నమోదయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. పదిలక్షల మంది పిల్లల్లో ఇలా ఒకరికే జరిగే అవకాశముందని వైద్యులు పేర్కొన్నారు.

ఫిఫ్ పిండంలో పిండం అన్నది చాలా అరుదైన  స్థితిగా పేర్కొన్నారు. శరీరం లోని వెన్నుపూసలో రెండు పిండాలు ఉండడాన్ని గమనించినట్లు డాక్టర్స్ తెలిపారు.రాంచి నగరానికి చెందిన పిడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ, 5 లక్షల మందిలో ఎవరూకరికి మాత్రమే వస్తుందని  ఈ అంశం అంతర్జాతీయ  జర్నల్ లో ఫిఫ్ ఒక కేసు మాత్రమే ఉంటుందనిఅయితే చాలా పిండాలు ఉండ డం చూడలేదని డాక్టర్ పేర్కొన్నారు.