మావోయిస్టుల ప్ర‌తికార చ‌ర్య‌... 8 మంది జవాన్లు మృతి...

 

గత కొద్ది రోజుల క్రిందట తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు  మావోయిస్టులు జ‌వాన్ల‌పై ప్ర‌తికార చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని గొల్లపల్లి-కిష్టరాం ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తోన్న‌ సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై కాల్పుల‌కు తెగ‌బ‌డి 8 మంది జవాన్ల ప్రాణాలు తీశారు. ఈ కాల్పుల్లో మరో ఆరుగురు జవాన్ల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయాల‌పాలైన జ‌వాన్ల‌ను రాయ్‌పూర్ ఆసుప‌త్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఆసుప‌త్రికి తరలిస్తున్నారు.