TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాలికపై ..కొడుకు అత్యాచారం..తండ్రి చంపేశాడు

Published on: Thu Jun 30, 2016 4:20PM

దేశ అత్యాచారాల రాజధాని ఉత్తరప్రదేశ్‌లో చిన్నారులు..మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా కొడుకు అత్యాచారం చేసిన బాలికను అతని తండ్రి హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఉద్రిక్తతలకు దారి తీసింది. జూన్ 5వ తేదీన అలహాబాద్‌లో ఓ బాలికపై పొరుగింట్లోని 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే కొద్ది రోజుల వరకు పోలీసులు కేసు నమోదు చేసుకోలేదు. ప్రజా సంఘాలు, స్థానికుల ఒత్తిడితో ఎట్టకేలకు పోలీసులు గత గత ఆదివారం 15 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు. తమ కొడుకు అరెస్ట్ కావడం జీర్ణించుకోలేని బాలుడి తండ్రి పాపపై పగ పెంచుకున్నాడు.

 

నిందితుడి అరెస్ట్ జరిగిన రెండు రోజుల తర్వాత బాలుడి తండ్రి, మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి రాత్రిపూట పాపను ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి దారుణంగా కొట్టి చంపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి తండ్రిని అరెస్ట్ చేశారు. తన కొడుకుని కాపాడుకోవడానికే అతను పాపను చంపేశాడని పోలీసులు వెల్లడించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం పాప మృతదేహాన్ని అప్పగించే సమయంలో తీవ్ర ఆందోళనలు జరిగాయి. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహన్ని తీసుకోమని చిన్నారి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. దీనికి స్థానికులు కూడా తోడవ్వడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి పోలీసులు లాఠీఛార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.