TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏడుచోట్ల మార్పులు, నాలుగు చోట్ల పెండింగ్ 

Published on: Mon Aug 21, 2023 4:47PM

రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొత్తం 115 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా ప్రకటించారు. పెద్దగా మార్పులేమీ లేవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేవలం 7 చోట్ల మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఉప్పల్, కోరుట్ల, స్టేషన్ ఘనపూర్, వైరా సిట్టింగ్స్ మార్పులు చేస్తున్నామన్నారు. మిగతా అన్ని చోట్లా సిట్టింగులతోనే బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు. 2023 ఎన్నికలకు ఆరేడుగురు సిట్టింగ్‌లను మాత్రమే తప్పించామని, అందులోను బాగా పని చేసే అభ్యర్థులు కూడా ఉన్నారని కెసీఆర్ చెప్పారు. ఉదాహరణకు వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేశ్ పౌరసత్వం నేపథ్యంలో ఆయనకు టిక్కెట్ ఇవ్వడం లేదన్నారు. మొత్తానికి పెద్దగా మార్పులు, చేర్పులు లేవన్నారు. 
జనగామ, నాంపల్లి, గోషామహల్, నర్సాపూర్ నియోజకవర్గాలను పెండింగ్‌లో ఉంచినట్లు చెప్పారు.
కాగా సీఎం కేసీఆర్ 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. గజ్వేల్‌తోపాటు వికారాబాద్ నుంచి బరిలోకి దిగుతున్న వెల్లడించారు. కాగా నాలుగు చోట్ల కొత్తవారితో పోటీకి దిగుతున్నామన్నారు. కాగా నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామాల్, కొంపల్లి అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో ఉందన్నారు.