TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

7 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నిక...

Published on: Tue Mar 7, 2017 5:06PM

 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల కోటాలోని 7 ఎమ్మెల్సీ స్థానాలు నామినేషన్ల స్వీకరణ జరగుతున్న సంగతి తెలసిందే. 7 ఎమ్మెల్సీ స్థానాలకు 7 దరఖాస్తులు రావడంతో ఏడుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే దీనికి సంబంధించిన ప్రకటన రేపు విడుదల కానుంది. టీడీపీ నుండి నారా లోకేష్‌, బచ్చుల అర్జునుడు, కరణం బలరాం, పోతుల సునీత, డొక్కా మాణిక్యవరప్రసాద్ నామినేషన్ దాఖలు చేయగా.. వైసీపీ నుండి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖ‌లు చేశారు. అయితే ఈ స్థానాలకు ఎలాంటి పోటీ లేకపోవడంతో వారంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎల్లుండి నామినేష‌న్ల ఉపసంహరణ గడువు ముగియ‌డంతో... రేపు నామినేషన్ల పరిశీలన అనంతరం వీరిని ఏకగ్రీవంగా ప్రకటించనున్నారు.