7 నిమిషాలు.. రూ. 6 కోట్లు..
Published on: Tue Dec 24, 2013 6:52AM

నటిగానే కాక 2013లో గాయనిగానూ వార్తల్లోకి వచ్చిన ప్రియాంక చోప్రా ఈ సారి వేడుకల్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న తారగా నిలవనుందని మార్కెట్ టాక్. చెన్నైలో జరగనున్న ఓ వేడుకలో పాల్గొనడం కోసం ఆమె భారీగా రూ 6 కోట్లు రెమ్యునరేషన్ అందుకోనుందట. ఇప్పుడు ఈ వార్త సినిమా వర్గాల్లో హల్‌చల్ చేస్తుంది. గత ఏడాది రూ.3 కోట్లతొ కత్రినా సృష్టించిన రికార్డును ప్రియాంక తిరగరాయనుందట.


