TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

66మంది మెడికోస్‌కి కొవిడ్‌.. టీకా వేసుకున్నా వైర‌స్.. థ‌ర్డ్ వేవ్ స్టార్టెడ్‌?

Published on: Thu Nov 25, 2021 5:35PM

వాళ్లంతా వైద్య విద్యార్థులు. కొవిడ్ గురించి, జాగ్ర‌త్త‌ల గురించి వాళ్ల‌కు బాగా తెలుసు. ఇప్ప‌టికే రెండు డోసుల టీకా కూడా వేసుకున్నారు. కాక‌పోతే క‌రోనాను కాస్త లైట్ తీసుకున్నారు. ఇటీవ‌ల కాలేజ్‌లో ఓ ఈవెంట్ జ‌రిగితే.. అంతా హాజ‌ర‌య్యారు. మ‌స్త్ మ‌స్త్ ఎంజాయ్ చేశారు. క‌ట్ చేస్తే.. 300మంది మెడికల్ స్టూడెంట్స్‌లో 66 మందికి కొవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. అంద‌రినీ హాస్ట‌ల్‌లో ఉంచి.. గేట్ల‌కు తాళాలు వేసి.. క్వారంటైన్ చేశారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా.. ఒకేసారి ఇంత‌మందికి క‌రోనా సోక‌డం.. థ‌ర్డ్ వేవ్ ఆరంభమైందా అనే అనుమానం రేకెత్తిస్తోంది. వెంట‌నే వైద్య అధికారులు అల‌ర్ట్ అయ్యారు.

కర్ణాటక, ధార్వాడ్‌లోని ఓ మెడికల్ కాలేజీలో ఏకంగా 66 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకడం క‌ల‌క‌లం రేపుతోంది. ఎస్‌డీఎం కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో మొత్తం 400 మంది విద్యార్థుల్లో 300 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 66 మంది పాజిటీవ్‌గా తేలింది. సమాచారం తెలుసుకొన్న అధికారులు వెంటనే ముందు జాగ్రత్త చర్యగా కాలేజీలోని రెండు హాస్టళ్లను మూసివేశారు. ఎవరినీ బయటకు వెళ్లనీయడంలేదు. ‘‘మిగిలిన 100 మందికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తాము. ఎవరినీ అడుగు బయటపెట్టనీయడం లేదు. కళాశాలలో ఇటీవల ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు అందరినీ పరీక్షించాము. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో ఉన్నాము’’ అని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.  

క‌ర్నాట‌క‌లోనే కాదు.. ఒడిశాలోని విమ్సార్‌లోని మెడిక‌ల్ కాలేజీలోనూ ఇలానే క‌రోనా క‌ల‌క‌లం రేగింది. 54మందికి కొవిడ్ సోకింది. వైరస్ బారినపడిన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు నాలుగు హాస్టళ్లను మైక్రో కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. పది రోజుల పాటు క్లాసులు సస్పెండ్ చేశారు. ఈ రెండు ఘటనలు ఇటీవల ఆయా కాలేజీల్లో నిర్వ‌హించిన‌ ఈవెంట్ వ‌ల్లే జ‌ర‌గ‌డం ఆస‌క్తిక‌రం. అందుకే, క‌రోనా లేద‌ని బిందాస్‌గా ఉండ‌కుండా.. కొవిడ్ ప్ర‌మాదం ఇంకా పూర్తిగా తొల‌గిపోలేద‌ని జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. గ్రూప్ యాక్టివిటీస్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.