TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

20 నెలల పాలనలో 60 విజయాలు.. చంద్రబాబు

Published on: Thu Feb 12, 2026 11:23AM

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు బుధవారం (ఫిబ్రవరి 11)  అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కూటమి  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ  20 నెలలలో సాధించిన విజయాలను, చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు వివరించారు.

 కూటమి ప్రభుత్వం ఈ 20 నెలల కాలంలో  సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెప్పారు విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం పురోగమిస్తోందన్న చంద్రబాబు, ప్రతి రంగంలోనూ వృద్ధి నమోదైందని వివరించారు.

ప్రజావసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకుంటూ అతి తక్కువ కాలంలోనే ప్రజలు మెచ్చే పాలన అందించామన్న చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వం ఈ 20 నెలలలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలను వివరించారు.