TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏటీఎమ్ నుంచి డబ్బులే డబ్బుల్.. తీసుకునేందుకు ఎగబడ్డ జనాలు 

Published on: Sat May 15, 2021 5:25PM

ఏటీఎమ్.. ఎనీ టైమ్ మనీ.. మన బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు మనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి ఏటీఎమ్ లను ఏర్పాటు చేశారు. ఏటీఎంలోకి వెళ్లి మనం ఎంత మనీ డ్రా చేయాలనుకుంటామో అంతే కొట్టి తీసుకొని వస్తాం. కానీ వనపర్తి జిల్లాలోని ఓ ఏటీఎంలో రూ.100 కొడితే రూ.500 వచ్చాయి.. ఇకేం డబ్బులు అదనంగా వస్తుండటంతో జనాలు ఎగబడ్డారు.. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఆ ఏటీఎమ్ ను సీజ్ చేశారు. 

వనపర్తి జిల్లాలోని అమరచింతలో ఉన్న ఇండియా నెం.1 ఏటీఎంలో శనివారం  ఓ వింత ఘటన చేసుకుంది.  ఇండియా నెం.1 ఏటీయంలో.. రూ. 100లకు బదులు ఏకంగా రూ.500 డ్రా అయ్యాయి. అలా చేస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. స్థానికులు ఒక్కొక్కరూగా వచ్చి డబ్బులు డ్రా చేసి సంబరాల్లో మునిగిపోయారు. ఈ విషయం ఒకరి నుంచి ఒకరికి ఫోన్ల ద్వారా చెప్పుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) స్థానికులు ఒక్కొక్కరూగా వచ్చి డబ్బులు డ్రా చేసి సంబరాల్లో మునిగిపోయారు. ఈ విషయం ఒకరి నుంచి ఒకరికి ఫోన్ల ద్వారా చెప్పుకున్నారు.ఫోన్ చేసి మరీ ఏటీఎం కార్డులు తెప్పించుకున్నారు. డ్రా చేసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా అక్కడ నుంచి కదల్లేదు.  మళ్లీ మళ్లీ డ్రా చేసుకుంటూనే ఉన్నారు. 

అయితే పోలీసులు పెట్రోలింగ్‌కు రావడంతో అక్కడి నుంచి అందరూ పారిపోయారు.  అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. వెంటనే సంబంధిత ఏటీయం అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏటీఎమ్ సిబ్బంది  వచ్చి ఏటీయంలోని సాంకేతిక లోపాన్ని గుర్తించి సరి చేశారు. అధనంగా ఆ ఏటీఎం నుంచి ఎంత డబ్బులు డ్రా అయ్యాయనే విషయంపై ఆరా తీస్తున్నారు.అంతే కాకుండా ఎవరి అకౌంట్ హోల్డర్ నుంచి డ్రా చేసుకున్నారో వివరాలను తెలుసుకుంటున్నారు.