TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశాఖ టెక్కీకి 50 లక్షల జీతం.. గూగుల్‌లో బంప‌ర్ ఆఫ‌ర్‌..

Published on: Fri Feb 4, 2022 3:58PM

ల‌క్ష సంపాదించాలంటే కొంద‌రికీ ఏడాది ప‌డుతుంది. మ‌రికొంద‌రికి నెల‌కు ల‌క్ష జీతం ఉంటుంది. లక్ష‌ల‌కు ల‌క్ష‌లు జీతం సాఫ్ట్‌వేర్ జాబుల‌కే సాధ్యం. అలాంటిది.. ఓ విశాఖ కుర్రాడికి ఏకంగా ఏడాదికి సుమారు 50 ల‌క్ష‌ల జీతం ఆఫ‌ర్ చేసింది గూగుల్. అత‌డి టాలెంట్ అలాంటిది మ‌రి. 

నర్సీపట్నానికి చెందిన జయంతి విష్ణువ్యాస్‌ గూగుల్‌ సంస్థలో రూ.47.50 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో 15 లక్షల వార్షిక వేతనంతో పనిచేస్తున్నాడు. 

ఇటీవల గూగుల్‌ల్లో కోడింగ్‌కు సంబంధించి 6 దశల ఇంటర్వ్యూ ఫేస్ చేశాడు. లెవెల్‌-4 సీనియర్‌ ఇంజినీర్‌ పోస్టుకు సెలెక్ట్ అయ్యాడు. బెంగళూరు గూగుల్ క్యాంప‌స్‌లో జాయిన్ కానున్నాడు. విష్ణువ్యాస్‌ హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎన్‌ఐటీలో బీటెక్‌ ఈసీఈ చ‌దివాడు. 23 ఏళ్ల‌కే ఇలా ఏడాదికి 47.50 ల‌క్ష‌ల శాల‌రీ అంటే.. ముందుముందు మ‌నోడు ఇంకెంత సంపాదిస్తాడో...!