TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఓటమి చవిచూసిన ముఖ్యమంత్రులు..

Published on: Sat Mar 11, 2017 3:20PM

 


ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసిన ముఖ్యమంత్రులు దాదాపు ఓటమి పాలయ్యారు. ఉత్త‌రాఖండ్‌ సీఎం హ‌రీష్ రావ‌త్ ఏకంగా రెండు స్థానాల నుండి పోటీ చేసినా ఒక్క స్థానం నుండి కూడా గెలవలేకపోయారు. మొద‌ట హ‌రిద్వార్ రూర‌ల్ నుంచి రావ‌త్ ఓట‌మి పాలవ్వగా... కిచ్చా స్థానం నుంచి కూడా ఓడిపోయారు. ఇక గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ల‌క్ష్మీకాంత్ ప‌ర్సేక‌ర్‌కు కూడా ఓటమి పాలయ్యారు. గోవాలోని  మాండ్రెమ్ స్థానం నుంచి పోటీ చేసిన ఆయనకు ఓటమి ఎదురైంది. ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ సోప్టే గెలుపొందారు. ఉత్తర ప్రదేశ్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాప కింద నీరులా వచ్చిన బీజేపీ క్లీన్ స్వీప్ చేసి పార్టీలన్నింటికి షాకిచ్చింది. ఇక బీజేపీ ని ఎలాగైనా అధికారంలోకి రానివ్వకుండా చేద్దామని జట్టు కట్టిన ఎస్పీ-కాంగ్రెస్ కూటమి కూడా ఏం చేయలేక పోయింది.  ఎమ్మెల్సీగా ఉన్న యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ సింగ్ గెలిచినా.. పార్టీ మాత్రం ఓటమి పాలైంది. ఇదిలా ఉండగా ఒక్క మణిపూర్ సీఎం ఒక్రమ్ ఇబోబి సింగ్ మాత్రం విజయం సాధించారు.