TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పదేళ్ల తర్వాత పంజాబ్‌‌లో పాగా

Published on: Sat Mar 11, 2017 2:47PM

 

దశాబ్ద కాలం తర్వాత పంజాబ్‌లో మళ్లీ కాంగ్రెస్ గాలి వీచింది. అకాలీదళ్ కోటను బద్దలు కొట్టి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అకాలీదళ్‌-బీజేపీ కూటమిని కాంగ్రెస్ పార్టీ మట్టి కరిపించింది. చావోరేవో తేల్చుకునేందుకు బరిలోకి దిగిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు అన్ని అంశాలు కలిసివచ్చాయి. మాజీ క్రికెటర్ నవజ్యోత్‌ సింగ్  సిద్ధూ చేతులు కలపడం, ప్రభుత్వంపై వ్యతిరేకత భారీ స్థాయిలో వ్యక్తం కావడంతో హస్తం పార్టీకి తిరుగులేకుండా పోయింది. పంజాబ్‌లో కాంగ్రెస్ విజయం సాధించకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన అమరీందర్... సిద్ధూతో కలిసి కాంగ్రెస్‌ను విజయతీరాలకు నడిపించారు. పాటియాలా నుంచి అమరీందర్‌, అమృత్‌సర్‌ ఈస్ట్‌ నుంచి సిద్ధూ విజయం సాధించారు. అమరీందర్‌ ముఖ్యమంత్రి పగ్గాలు చేపడితే.... సిద్ధూకి డిప్యూటీ సీఎం పదవి దక్కనుంది.