TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

యూపీ సీఎం పగ్గాలు ఎవరి చేతికి..?

Published on: Sat Mar 11, 2017 12:30PM

 


ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బీజేపీ పార్టీ అన్ని పార్టీలను క్లీన్ స్వీప్ చేసేసింది. బీజేపీ ని ఎలాగైనా అధికారంలోకి రాకుండా చేయాలని భావించి కాంగ్రెస్-సమాజ్ వాదీ పార్టీలు కూటమిగా ఏర్పడినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ప్రజలు బీజేపీ పార్టీకే పట్టంగట్టారు.  మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో బీజేపీ 300 స్థానాలను పైగా గెలుపొంది దాదాపు 15 ఏళ్ల తరువాత అధికారం చేజిక్కించుకుంది. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇప్పుడు బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తారు అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఈ చర్చలోనే కొంతమంది పేర్లు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఈ ఎన్నికల్లో గెలవడానికి ముఖ్య పాత్ర వహించిన యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆయన ఫుల్పుర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే యాదవేతరుల (ఓబీసీలు) మద్దతును కూడగట్టవచ్చని బీజేపీ భావిస్తున్నది.

 

ఆ తరువాత కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేరు కూడా వినిపిస్తోంది.  2002లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం, పార్టీలో పలు కీలక పదవులతోపాటు బీజేపీ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేయడంతో ఆయన పేరు కూడా బలంగానే వినిపిస్తోంది.

 

ప్రస్తుతం ఆయన రైల్వే, టెలికాం సహాయమంత్రిగా ఉన్న ఘాజీపూర్ ఎంపీ మనోజ్ సిన్హా (57) పేరు సైతం యూపీ సీఎం అభ్యర్థుల రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నది. ఆయన బ్రాహ్మణ కులానికి చెందినవాడు కావడంతో పార్టీ ఒకటికి రెండుసార్లు ఆలోచించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

 

సీఎం పీఠం రేసులో గోరఖ్‌పూర్ ఎంపీ, ఫైర్‌బ్రాండ్ యోగి ఆదిత్యనాథ్ పేరు అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌తో బలమైన సంబంధాలు ఆయనకు కలిసొచ్చే అంశం.

 

మరి వీరి నలుగురిలో బీజేపీ ఎవరికి సీఎం పగ్గాలు అప్పగిస్తుందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.