15 ఏళ్ల తరువాత అధికారంలోకి బీజేపీ...
Published on: Sat Mar 11, 2017 11:08AM
.jpg)
యూపీలో బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. సైకిల్-హస్తం గుర్తు అట్టర్ ప్లాప్ అయింది. కాషాయ దళం ప్రభంజనానికి మిగిలిన పార్టీలు కొట్టుకుపోయాయి. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో బీజేపీ 300 స్థానాలను పైగా గెలుపొందగా.. మిగిలిన పార్టీలు ఎస్పీ 69, బీఎస్పీ 21, ఇతరములు 7 స్థానాలు గెలుచుకున్నాయి. ఇదిలా యూపీలో బీజేపీ గెలుపులో ఓబీసీలదే కీలక పాత్ర వహించినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో పెరిగిన హింసాకాండలు, అసహనం, గత రెండు మూడేళ్లలో జరిగిన నేరాలు వంటివి ఓటర్లను బీజేపీ వైపు ఆకర్షితులను చేశాయి. దీంతో బీజేపీలో యూపీ గెలుపుకు పట్టంగట్టాయి. దీంతో దాదాపు 15 ఏళ్ల తరువాత బీజేపీకి అధికారంలోకి వచ్చింది.


