రాజీనామాకు రెడీ అయిన అఖిలేశ్..
Published on: Sat Mar 11, 2017 10:49AM
.jpg)
ఇదిలా ఉండగా.. సమాజ్ వాద్ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలోనే యూపీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అప్పుడే తను రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. దీనిలో భాగంగానే ఆయన గవర్నర్ అపాయింట్ మెంట్ ను కోరారు. మధ్యాహ్నం తరువాత ఆయన గవర్నర్ ను కలిసి తన రాజీనామాను సమర్పిస్తారని తెలుస్తోంది. కాగా మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో బీజేపీ 300 స్థానాలను పైగా గెలుపొందగా.. మిగిలిన పార్టీలు ఎస్పీ 69, బీఎస్పీ 21, ఇతరములు 7 స్థానాలు గెలుచుకున్నాయి.


