TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమయ్యేనా...?

Published on: Sat Mar 11, 2017 9:29AM

 

ఐదు రాష్ట్రాలు గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరఖండ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల లెక్కింపు మొదలైంది. గత రెండు రోజుల క్రితమే ఈ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ రిజల్ట్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో బయటకు వస్తున్న వార్తల ప్రకారం.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొంత వరకూ నిజమైనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే యూపీలో బీజేపీకి పూర్తి మెజార్టీ దక్కే అవకాశం ఉందని.. భాజపా అతిపెద్ద పార్టీ ఆవిర్భవించనుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. దాని ప్రకారమే ఇప్పుడు యూపీలో బీజేపీ ప్రభంజనం సాగుతోంది. ఇప్పటికే యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 204 కాగా.. అందులో బీజేపీ 220 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళుతోంది.

 

ఇక మిగిలిన సమాజ్ వాదీ కూటమి 62 స్థానాల్లో, బీఎస్పీ 28 స్థానాలకు పరిమితం కాగా, మరో 12 చోట్ల ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. ఇక మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరఖండ్, మణిపూర్ లో కూడా బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతుంది. పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ ఇప్పటికే మేజిక్ ఫిగర్ ను దాటేసింది. గోవాలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోటా పోటీ నెలకొంది.