ఐదు రాష్ట్రాల్లో మొదలైన కౌంటింగ్..
Published on: Sat Mar 11, 2017 9:10AM

ఈరోజు ఐదు రాష్ట్రాలు గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరఖండ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. కాగా, చిన్న రాష్ట్రాలైన గోవా, మణిపూర్ లో పూర్తి ఫలితాలు మధ్యాహ్నం 12 లోగా వెల్లడి కావచ్చని తెలుస్తోంది. ఆపై ఉత్తరాఖండ్ ఫలితాలు ఒంటి గంటకూ, పంజాబ్ ఫలితాలు 3 గంటలకు, ఉత్తరప్రదేశ్ ఫలితాలు సాయంత్రం 5 గంటల్లోపు వెలువడవచ్చని భావిస్తున్నారు.


