TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆజాద్ వ్యాఖ్య దురదృష్టకరమన్న టీ-ఎంపీలు

Published on: Fri Jan 6, 2012 1:56PM

హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపై నిర్ణయం ఉంటుందని కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించడం దురదృష్టకరమని తెలంగాణప్రాంత పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం శుక్రవారం అన్నారు. ఎంపీలు మందా, పొన్నం ప్రభాకర్, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఉద్యమంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ కోసం మేమంతా కట్టుబడి ఉన్నామని అందుకోసం ఉద్యమిస్తామన్నారు. ప్రజల ఆకాంక్షను అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామన్నారు. వరంగల్ జిల్లాలో రైతు పోరు యాత్ర చేపడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన ఎంపీలు విరుచుకు పడ్డారు. తాము కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.