గుజరాత్‌లో పేలుడు: ఐదుగురు మృతి
Published on: Sat Jun 28, 2014 2:03PM

ఆంధ్రప్రదేశ్‌లోని నగరం గ్రామంలో జరిగిన గ్యాస్ పేలుళ్ళ కారణంగా 16 మంది మరణించారు. ఈ సంచలనం సర్దుమణగక ముందే గుజరాత్‌లో గ్యాస్‌కి సంబంధించిన మరో సంఘటన శనివారం జరిగింది. గుజరాత్ భావ్‌నగర్ జిల్లాలోని అలాంగ్‌లో వున్న షిప్ బ్రేకింగ్ యూనిట్‌లో జరిగిన గ్యాస్ సంబంధిత పేలుడులో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు కార్మికులు తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. వీరిని భావ్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఒక పాత షిప్‌ను విడదీస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.


