TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మట్టి రూపంలో వచ్చిన మృత్యువు

Published on: Fri Jul 11, 2014 6:00PM

 

మట్టి మనుషులను ఆ మట్టే మింగేసింది. పొట్ట కూటి కోసం కూలి పనులు చేసుకుంటున్న కార్మికులను మృత్యువు మట్టి రూపంలో వచ్చి కబళించింది. నల్గొండ జిల్లా మేళ్ళచెరువు మండలం వజినేపల్లి దగ్గర జరుగుతున్న పులిచింతల విద్యుత్ కేంద్రం దగ్గర జరిగిన ప్రమాదంలో ఐదుగురు మరణించారు. విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు జరుగుతుండగా అకస్మాత్తుగా మట్టి పెళ్ళలు విరిగిపడటంతో ఐదుగురు మరణించారు. వీరిలో నలుగురు కూలీలు కాగా, ఒకరు సబ్ కాంట్రాక్టర్. మరణించిన కూలీలలో ముగ్గురు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని తెలుస్తోంది.