TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో ఒక్క‌రోజులోనే 4,348 కేసులు.. సంక్రాంతికి షాక్ త‌ప్ప‌దా?

Published on: Thu Jan 13, 2022 4:22PM

ఆంధ్ర‌ప్ర‌దేవ్‌లో కొవిడ్ కేసులు జెట్ స్పీడ్‌తో పెరిగిపోతున్నాయి. రోజు రోజుకూ వేల‌ల్లో కేసులు పెరుగుతున్నాయి. మంగ‌ళ‌వారం 2వేల‌కు పైగా కేసులు వ‌స్తే.. బుధ‌వారానికి ఆ సంఖ్య 3వేలు దాటేసింది. లేటెస్ట్‌గా ఏపీలో ఒక్క‌రోజులోనే 4వేల‌కు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 47,884 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 4,348 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో ప్రస్తుతం 14,204 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొవిడ్‌ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. కరోనా బారి నుంచి 261 మంది కోలుకున్నారు. 

ఇంకా సంక్రాంతి స్టార్ అవ్వ‌నే లేదు.. అప్పుడే క‌రోనా కుమ్మేస్తోంది. పండ‌గ వేడుక‌ల‌పై దెబ్బ కొట్టేలా పంజా విసురుతోంది. ఇక సంక్రాంతితో కేసులు మ‌రెన్ని పెరిగిపోతాయోన‌ని జ‌నం హ‌డ‌లిపోతున్నారు. పండ‌గ మూడు రోజులు బంధువులు, స్నేహితుల‌తో సామూహిక వేడుక‌లు కామ‌న్‌. సినిమాలు, షికార్లు, విందు భోజ‌నాలు, పందేలు.. ఇలా భోగి, సంక్రాంతి, క‌నుమ మూడు రోజులు ఏపీలో సంబ‌రాలు అన్నీఇన్నీ కావు. 

ఆంధ్రుల పెద్ద పండుగ ముంద‌ర‌.. రోజుకు 4వేల‌కు పైగా కొవిడ్ కేసులు రావ‌డంతో అంతా ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డుతున్నారు. కేసుల తీవ్ర‌త ఇంత‌లా ఉంటే.. ఇక సంక్రాంతి బిక్కుబిక్కుమంటూ జ‌రుపుకోవాల్సి వ‌స్తుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఈసారి సంక్రాంతి సాదాసీదాగా జ‌రుపుకునేందుకే ఇంట్రెస్ట్ చూపుతున్నారు ప్ర‌జ‌లు. ఎందుకైనా మంచిది ఇంట్లోనే ఉండండి. జాగ్ర‌త్త‌గా ఉండండి.