TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

402 మంది పార్లమెంట్ సిబ్బందికి కొవిడ్.. ఢిల్లీలో 10 దాటిన పాజిటివిటి రేట్

Published on: Sun Jan 9, 2022 3:12PM

దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ కల్లోలం స్పష్టిస్తోంది. కొత్త కేసుల సంఖ్య అత్యంత ప్రమాదకరంగా పెరిగిపోతోంది. దేశంలో రోజువారీ కేసులు 2 లక్షలకు దగ్గరలో ఉన్నాయి. జనవరి నెలాఖరుకు కొవిడ్ తీవ్రత పీక్ స్టేజీకి చేరుతుందని చెబుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ పంజా విసురుతోంది. పాజిటివిటి రేటు 10 శాతం దాటడం వైద్య వర్గాలను కలవరపరుస్తోంది. ఢిల్లీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 20 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి

తాజాగా భారత పార్లమెంట్ లో కొవిడ్ కల్లోలం స్పష్టించింది. పార్లమెంట్‌లో పనిచేసే 402 మందికి కొవిడ్ సొకింది. పార్లమెంట్ లోని మొత్తం 1,409 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తే.. వారిలో 402 మంది సిబందికి పాజిటివ్‎గా నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు. పాజిటివ్ వచ్చిన వారిలో 200 మంది లోక్‎సభ సిబ్బంది ఉంటే.. 69 మంది రాజ్యసభ సిబ్బంది ఉన్నారు. మిగతా 133 మంది సిబ్బంది ఇతర స్టాఫ్‎గా అధికారులు గుర్తించారు. పాజిటివ్ వచ్చిన వారితో పాటు వాళ్ల కాంటాక్ట్‎లను గుర్తించి హోం ఐసోలేషన్ కు తరలించారు. ఫిబ్రవరి 1నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు సిబ్బందికి కరోనా సోకడంతో సమావేశాలపై సందిగ్ధత నెలకొంది. 

ఢిల్లీలో ప్ర‌స్తుతం నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. పాజిటివిటీ రేటు పెరుగుతుండ‌టంతో వీకెండ్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఢిల్లీ రాష్ట్ర‌ప్ర‌భుత్వం వ‌ర్క్‌ఫ్ర‌మ్ హోమ్ సౌక‌ర్యాన్ని క‌ల్పించింది.