TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

Published on: Thu Jun 11, 2026 4:45PM

 

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. నాలుగు స్థానాలకు నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలవడంతో అభ్యర్థుల ఎన్నికను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ రాజ్యసభకు ఎన్నిక కాగా, జనసేన పార్టీ నుంచి లింగమనేని రమేష్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి పోటీలో ఈ నలుగురు అభ్యర్థులే మిగలడంతో ఎన్నిక అనివార్యంగా ఏకగ్రీవమైంది. దీంతో అధికార కూటమికి చెందిన అభ్యర్థుల విజయం ముందుగానే ఖరారైంది. ఎన్నికైన సభ్యులకు రిటర్నింగ్ అధికారి వనిత రాణి అధికారిక ధ్రువీకరణ పత్రాలు (ఫారం-22) అందజేయనున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం జూన్ 1న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆ షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తికాగా, ఏపీలో నాలుగు స్థానాలకు నాలుగు నామినేషన్లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.