మొదలైన బ్యాంకుల బాదుడు..నాలుగు సార్లకు మించితే
Published on: Thu Mar 2, 2017 9:35AM

నగదు లావాదేవీలపై ఇక నుంచి బ్యాంకులు రుసుమును వసూలు చేయనున్నాయి. ఇప్పటి వరకు నెలకు నాలుగు ఉచిత లావాదేవీలను అనుమతిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు..నగదు ఉపసంహరణ లేదా నగదు డిపాజిట్లు నాలుగు సార్లకు మించితే ఒక్కో లావాదేవీపై నిన్నటి నుంచి రూ.150 వసూలు చేస్తున్నాయి. సేవింగ్స్‌తో పాటు జీతాల ఖాతాలకు ఇది వర్తిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఏటీఎంలలో మాత్రం పరిస్థితి యధాతథంగా కొనసాగుతుంది.
హెచ్‌డీఎఫ్‌సీ:
* థర్డ్ పార్టీ నగదు లావాదేవీలు రోజుకు రూ.25 వేలు మాత్రమే
ఐసీఐసీఐ:
* హోం బ్రాంచిలో ఒక నెలలో తొలి నాలుగు నగదు లావాదేవీలపై రుసుము ఉండదు.
* థర్డ్ పార్టీ నగదు లావాదేవీలు రోజుకు రూ.50 వేలు మాత్రమే
యాక్సిస్ బ్యాంక్:
* తొలి ఐదు లావాదేవీలు లేదా రూ.10 లక్షల నగదు డిపాజిట్లు లేదా ఉపసంహరణకు ఎలాంటి రుసుము ఉండదు.
* పరిమితి దాటితే రూ.150 లేదా రూ.వెయ్యికి రూ.5 ఏది ఎక్కువయితే ఆ మొత్తం రుసుముగా వసూలు చేస్తారు.


