తెలంగాణలో 364 పెరిగిన కేసులు! 45 మంది డిశ్చార్జ్‌!

తెలంగాణలో 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే పూర్తిగా కోలుకున్న‌ 45 మందిని డిశ్చార్జ్ చేశారు. కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 11 మంది చనిపోయారు.

విదేశాల నుంచి తిరిగొచ్చిన వారి ద్వారా 50 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో డైరెక్ట్‌గా వ‌చ్చిన వారు 30 మంది. వారి కుటుంబ సభ్యులు 20 మంది. మొత్తం 50 మందికి పాజిటివ్ వ‌చ్చింది. వీరిలో ఒక్కరు కూడా చనిపోలేదు. ఇప్పటికే 35 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఢిల్లీ మ‌ర్క‌జ్‌కు వెళ్లొచ్చిన వారు 1089 మంది. వీళ్లలో 172 మందికి వైరస్ సోకింది.. ఇందులోనే 11 మంది చనిపోయారు. వీరి ద్వారా మరో 93 మందికి వైరస్ సోకింది. వాళ్లతో కాంటాక్ట్ అయిన 3015 మంది వివరాలను సేకరించారు. మరో 30-35 మంది ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. 308 మంది హాస్పిటల్‌లో ఉండగా.. క్వారంటైన్లో ఉంచిన 1000 మందికి జబ్బు లేదని తెలిసింది. ఇటీవల 194 మందిలో ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదు.

రాష్ట్రంలో 364 మందికి కరోనా సోకింది.. వీరిలో 10 మంది ఇండోనేసియన్లు ఉన్నారు. వీరందరికీ కోవిడ్ తగ్గిపోయి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తంగా చూస్తే 45 మంది డిశ్చార్జ్ కాగా... 11 మంది చనిపోయారు. గాంధీ హాస్పిటల్‌లో మిగతా వాళ్లు చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణలో మొత్తం 27,937 క్వారంటైన్లో ఉన్నారు. ఏప్రిల్ 9వ తేదీ నాటికి వీరిందరికి క్వారంటైన్ ముగుస్తుంది