బీహార్‌లో ప్రయాణికులపై దూసుకెళ్ళిన రైలు

Publish Date:Aug 19, 2013

Advertisement

 

 

 

బీహార్‌లో ఈరోజు తెల్లవారు జామున ఘోర రైలు ప్రమాదం సంభవించిది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 35కు పెరిగింది. సహార్సా నుంచి పాట్నా వెళ్లే రాజ్యరాణి ఎక్స్ప్రెస్ భమారా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులపై నుంచి దూసుకొని వెళ్ళింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికులు డ్రైవర్ను కొట్టడమే కాక, కొన్ని బోగీలకు నిప్పు పెట్టారు. దీంతో ఆ మార్గంలో కొంత సేపటి పాటు రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.