TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దారుణం..ఏకంగా 34 మంది పై అత్యాచారం

Published on: Sat Jul 28, 2018 3:34PM

ఒకరిద్దరు కాదు ఏకంగా 34 మందిపై అత్యాచారం జరగటం ఇది ఒక విషాదకరమైన పైశాచిక చర్య.బిహార్‌లోని ఓ వసతి గృహంలో ఉంటున్న దాదాపు 29 మంది బాలికలపై అత్యాచారం చేసిన సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ ఘటనకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యులు మరికొంతమంది బాలికలకు వైద్య పరీక్షలు చేయగా మరో ఐదురుగు కూడా అత్యాచారానికి గురైనట్లు తేలింది.మొత్తం 40 మంది బాలికలు ఉండగా.. వారిలో 34 మంది అత్యాచారానికి గురయ్యారు.

 

 

వారిని దారుణంగా హింసించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలు చెప్పుకొచ్చారు.బిహార్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ ప్రతినిధులు బాధిత చిన్నారులను కలుసుకున్నారు.ఈ సంఘటన గురించి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మ్‌పర్సన్‌ దిల్మని మిశ్రా తెలుపుతూ ‘వసతి గృహ సిబ్బంది చిన్నారులను దారుణంగా కొట్టి, వాళ్లు అరవకుండా ఉండేందుకు డ్రగ్స్‌ ఇచ్చేవారు. వాళ్లకు కనీసం తిండి కూడా పెట్టకుండా ఇష్టానుసారంగా కొట్టి హింసించే వారు.సిబ్బందిని ఎదిరించి ఎవరైనా మాట్లాడితే వాళ్ల దుస్తులు విప్పించి కొట్టడం, సిగరెట్లతో శరీరమంతా కాల్చడం చేసేవారు.’ అన్నారు.వసతి గృహంలో నివసించే ఓ బాలిక వాళ్ల ఆకృత్యాలను వ్యతిరేకించడంతో బాగా కొట్టారని.. దీంతో సదరు బాలిక అపస్మారక స్థితిలోకి చేరి ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె తెలిపారువసతి గృహ సిబ్బంది వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు విచారణలో వెల్లడైంది.

 

 

సీడబ్ల్యూసీ జిల్లా మానిటరింగ్‌ కమిటీ సభ్యులు పలుమార్లు ఆ గృహానికి పరిశీలించేందుకు వెళ్లారు. కానీ అక్కడ జరుగుతున్న అరాచకాల గురించి చెబితే చంపేస్తామని వసతి గృహ సిబ్బంది బాలికలను బెదిరించారు.దీంతో భయపడిపోయిన చిన్నారులు తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పేందుకు సాహసించలేదు. సీడబ్ల్యూసీ అధికారులు వచ్చినపుడు గృహ సిబ్బంది ఎవరూ బాలికలను ఒంటరిగా విడిచి వెళ్లేవాళ్లు కాదని మిశ్రా తెలిపారు.