సాక్షి సిబ్బంది నుంచి 32 లక్షల దోపిడీ
Published on: Sat Sep 13, 2014 3:26PM
.jpg)
సినీ ఫక్కీలో దోపిడీ చేసిన దొంగలు సాక్షి దినపత్రిక సిబ్బంది నుంచి 32 లక్షల రూపాయలను దోచుకున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఈ దోపిడీ జరిగింది. రేణిగుంట సాక్షి యూనిట్ కార్యాలయం నుంచి అకౌంటెంట్లు చంద్రశేఖర్, విజయకుమార్ రెడ్డి 32 లక్షల రూపాయల డబ్బును బ్యాగ్లో తీసుకుని బ్యాంకులో జమ చేయడానికి వెళ్లారు. వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఫాలో చేసిన ఓ స్కార్పియో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో చంద్రశేఖర్, విజయ్ కుమార్ రెడ్డి ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడ్డారు. ప్రమాదంలో వీరిద్దరికీ గాయలయ్యాయి. అదే సమయంలో వారి వెనకాలే ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనం అక్కడికి వచ్చి సాక్షి అకౌంటెంట్లు తీసుకెళ్తున్న 32 లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ను ఎత్తుకెళ్లారు.


