ఒక్కరోజులోనే 3వేల కేసులు.. ఏపీలో కరోనా కల్లోలం.. సంక్రాంతి అలర్ట్..
Published on: Wed Jan 12, 2022 3:57PM
ఇంకా సంక్రాంతి స్టార్ అవ్వనే లేదు.. అప్పుడే కరోనా కుమ్మేస్తోంది. పండగ వేడుకలపై దెబ్బ కొట్టేలా పంజా విసురుతోంది. రోజు రోజుకీ డబుల్ అవుతున్నాయి పాజిటివ్ కేసులు. లేటెస్ట్గా గడిచిన 24 గంటల్లో ఏకంగా 3,205 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 10,119 యాక్టివ్ కేసులున్నాయి.
రానున్నది సంక్రాంతి కావడంతో జనం హడలిపోతున్నారు. పండగ మూడు రోజులు బంధువులు, స్నేహితులతో సామూహిక వేడుకలు కామన్. సినిమాలు, షికార్లు, విందు భోజనాలు, పందేలు.. ఇలా భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు ఏపీలో సంబరాలు అన్నీఇన్నీ కావు. ఇలాంటి ఆంధ్రుల పెద్ద పండుగ ముందర.. రోజుకు 3వేలకు పైగా కొవిడ్ కేసులు రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. కేసుల తీవ్రత ఇంతలా ఉంటే.. ఇక సంక్రాంతి బిక్కుబిక్కుమంటూ జరుపుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈసారి సంక్రాంతి సాదాసీదాగా జరుపుకునేందుకే ఇంట్రెస్ట్ చూపుతున్నారు ప్రజలు. తస్మాత్ జాగ్రత్త..


