కోర్టులో బోరుమన్న 2జి స్కామ్ సాక్షి
Published on: Thu Dec 22, 2011 12:03PM
న్యూఢిల్లీ:
2జి స్పెక్ట్రమ్ స్కామ్ కుంభకోణం కేసులో కీలకమైన సాక్షి కోర్టులో ఏడ్చేశాడు. తనను ఓ వ్యక్తి బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ అతను కోర్టులో బోరుమన్నాడు.దీంతో నాటకీయ సంఘటన చోటు చేసుకుంది. టెలికం మాజీ మంత్రి ఎ.రాజా మాజీ అనుచరుడైన అశీర్వాథం ఆచారి తనను బెదిరిస్తున్న వ్యక్తి ప్రస్తుతం కోర్టులోనే ఉన్నాడని అతను చెప్పాడు. ప్రస్తుతం జైలులో ఉన్న టెలికం మాజీ మంత్రి రాజాకు అతను ఒకప్పుడు ముఖ్య సహాయకుడిగా పనిచేశాడు.డిబి రియాల్టీ, యునిటెక్ సంస్థలతో రాజాకు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలున్నాయని ఆచారి చెప్పాడు. ఆ రెండు సంస్థలకు రాజా నిబంధనలకు విరుద్ధంగా సహకరించారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆచారీ ఆరోపించారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సైనీ అతన్ని సాక్షిగా టెస్టిఫై చేశారు.


