ఇకపై సెల్లు బిల్లు మోత
Published on: Mon Oct 8, 2012 2:30PM
రానున్న కొద్దిరోజుల్లో వినియోగ దారులకు సెల్లు బిల్లు పేలనుంది. 2 జి స్కాం తరువాత అన్ని సెల్ ఫోన్ కంపెనీలు వేలం పాట ద్వారా ఆర్డర్లు దక్కించుకోవల్సిరావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిరది. ఇదివరలో సెల్ కంపెనీల మద్య వున్న పోటీల మూలంగా ఆఫర్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పెద్దమొత్తంలో ప్రభుత్వానికి సొమ్ము చెల్లించి వ్యాపారాలు మొదలు పెట్టినందువల్ల ఇకపై ఆఫర్లు కట్ అంటున్నాయి అన్ని కంపెనీలు. ఇప్పటికే అన్ని సెల్‌ఫోన్ల యాజమాన్యాలు నష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. ఒక్క ఫారిన్ కాల్స్ మీద తప్ప అన్నీ కాల్స్ మీద నష్టాలు వస్తున్నాయని సెల్‌ఫోన్ కంపెనీలు చెబుతున్నాయి. కాబట్టి అన్ని కంపెనీలు ఖర్చు తగ్గించుకునే పనిలో పడ్డాయి. దాంతో రానున్న రోజుల్లో కాల్ రేట్లు పెంచే ప్రయత్నం లో అన్ని కంపెనీలు ఉన్నాయి. అంటే ఉప్పు పప్పు, బియ్యం పంచదారతో పాటు చుట్టాల,స్నేహితుల యోగక్షేమాలు కనుక్కోవడం కూడా ఇకపై భారం అన్న మాట.


