సాక్ష్యం కోసం 7ఏళ్లు ఎదురుచూశా..!


2జీ స్కాం దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో.. ఈ కేసు తీర్పు కూడా అంతే సంచలనం సృష్టిస్తోంది. కేవలం ఎటువంటి ఆధారాలు లేవన్న సింగిల్ లైన్ తో కేసులో దోషులుగా ఉన్న వారిని నిర్దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చారు. ఇప్పటికే ఈ కేసు తీర్పు చూసిన తరువాత అందరూ షాక్ లో ఉంటే... దీనికితోడు ఇప్పుడు సీబీఐ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఈ కేసులో సాక్ష్యాల కోసం తాను ఏడేళ్లుగా ఎదురుచూశానని, అయినా తన ఎదురుచూపులు ఫలించలేదని అన్నారు. ఒక్కరు కూడా సాక్ష్యాన్ని తీసుకురాలేకపోయారని.. ప్రతి ఒక్కరూ పుకార్లు, ఊహాగానాలనే చెప్పారు తప్ప నేరాన్ని సాక్ష్యాలతో రుజువు చేయలేకపోయారని తెలిపారు. ఈ ఏడేళ్లలో ప్రతిరోజూ కోర్టుకు వచ్చా.. ప్రతిరోజూ ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు కోర్టు గదిలో కూర్చునే వాడిని.. సరైన సాక్ష్యాన్ని ఎవరైనా సమర్పిస్తారేమో అని ఎదురుచూసేవాడినని సైనీ అన్నారు.

 

అంతేకాదు సీబీఐ అధికారుల తీరుపై కూడా జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు అందించిన పత్రాల్లో సీనియర్‌ అధికారుల సంతకాలు లేవన్నారు. తుది విచారణ సమయంలో సమర్పించిన పత్రంలో అయితే అసలు ఎవరి సంతకమూ లేదన్నారు. ఎవరూ సంతకం చేయకపోతే ఆ డాక్యుమెంట్‌కు విలువ ఏమి ఉంటుందని జడ్జి ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో ఈ కేసులో చాలా లోపాలు ఉన్నాయని జడ్జి సైనీ తెలిపారు.

 

దీంతో జడ్జి గారిమాటలు ఆసక్తికరంగా మారాయి. మరి నిజంగానే సాక్ష్యాలు తేలేకపోయారా..? లేక సాక్ష్యాలు ఉన్నా రాజకీయ ప్రయోజనాల కోసం కనుమరుగు చేశారా..? అని అనుకుంటున్నారు. 1.76 కోట్లు అంటే ఏదో చిన్న విషయం అయినట్టు..చాలా సింపుల్ గా తీర్పు ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇవ్వండ్రా బాబు అంటే తొక్కలో సాకులు చెప్పే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు.. ఇన్ని కోట్లు పోయినా ఏం పట్టనట్టు చూస్తూ కూర్చుందంటే.. ఏమనుకోవాలి. ఇలానే చూస్తూ పోతే... అన్ని స్కాంల్లో ఇలానే సాక్ష్యాలు లేవని చాలా ఈజీగా అవినీతి తిమింగలాలను వదిలిపెడతార్న ఆశ్చర్యపోనక్కర్లేదు..