బయటపడిన బీజేపీ ఎలుకల స్కాం
Published on: Thu Jun 7, 2018 4:16PM

2G స్కాం, మైనింగ్ స్కాం ఇలా చాలా స్కాములు విన్నాం గాని ఈ 'ఎలుకల స్కాం' ఏంటి అనుకుంటున్నారా.. అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్ను విరిగిద్ది అన్నట్టు.. బీజేపీ అదృష్టం అడ్డం తిరిగి ఎలుకల స్కాం ఒకటి బయటపడింది.. అసలు మేటర్ ఏంటంటే.. మహారాష్ట్రలో బీజేపీ రూలింగ్లో ఉన్న విషయం తెలిసిందే.. అయితే అక్కడ సచివాలయంలో ఎలుకల బెడద బాగా ఉండటంతో.. ఆరు నెలల్లో ఆ ఎలుకలు అన్నింటినీ పట్టుకొని చంపి దూరంగా పడేయాలని ఒక కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చింది.. ఆ కంపెనీ వారం రోజుల్లో 3 లక్షల 19 వేల ఎలుకలు పట్టుకున్నట్టు నివేదిక ఇచ్చి.. ఒక్కో ఎలుకకు రూపాయిన్నర చొప్పున 5 లక్షలు వసూల్ చేసింది.. ఇంతవరకు బాగానే ఉంది.. ఇప్ప్పుడే అసలు కథ మొదలైంది.. వారం రోజుల్లో 3 లక్షల 19 వేల ఎలుకలు, అంటే రోజుకి 45 వేల ఎలుకలు పట్టడం సాధ్యమేనా?.. ఒకవేళ పట్టినా వాటిని ఎక్కడ పడేసారు అంటూ.. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.. దీంతో బీజేపీ ఎలుకల స్కాం బయటపడింది.. అంతా బాగానే ఉంది గాని బీజేపీ పెద్ద పెద్ద స్కాములు చేసిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. కొండని తొవ్వి ఎలుకని పట్టినట్టుగా ఈ ఎలుకల స్కాముని బయటపెట్టి ఏం లాభం...


