TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మారన్ సోదరులపై ఈడీ కేసు నమోదు

Published on: Wed Feb 8, 2012 2:38PM

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి దయానిధి మారన్, అతని సోదరుడు, సన్ టీవీ అధినేత కళానిధి మారన్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందంలో మారన్ సోదరులు అక్రమంగా 550 కోట్ల రూపాయల ముడుపుల స్వీకరించారన్న ఆరోపణలపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్‌ఎల్‌ఏ) కింద కేసు నమోదు చేశారు. మారన్ కేంద్ర టెలికాం మంత్రిగా పనిచేసిన 2004-05 సంవత్సర కాలంలో మలేషియాకు చెందిన మాక్సిస్‌కు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు రావడంతో గత సంవత్సరం కేంద్ర మంత్రి పదవినుంచి తప్పుకున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణల్ని మారన్ సోదరులు ఖండించారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో మారన్ సోదరుల పాత్రపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది.