TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒక టీ.. అది 100 సార్లు

Published on: Sat May 22, 2021 11:53AM

ఓ వైపు కరోనా వైరస్. మరో వైపు లాక్ డౌన్. ఇంకో వైపు ఆర్థిక ఇబ్బందులు. ఇంకో వైపు తీరని వాంఛలు. చాలా మంది ఉండటానికి గూడు లేక, తినదానికి తిండిలేక, వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక సతమతమవుతున్నారు. ఇంకొంత మంది తిన్నది అరగక వెక్కిలి పనులు చేస్తున్నారు. మరీ కొంతమంది మృగాళ్ల మనస్తత్వం మారడంలేదు. మహిళలను లైంగికంగా వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా ఓ యువతికి టీ లో మత్తు మందు ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, అనంతరం వీడియోలతో బెదిరిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఓపెన్ చేస్తే.. సోషల్ మీడియా ద్వారా ఓ 35 ఏళ్ళ వ్యక్తికి, 24 ఏళ్ళ యువతి  పరిచయమైంది. కొద్దీ రోజులకే ఆ పరిచయం స్నేహం గా మారింది. ఈ క్రమంలోనే ఒకరోజు యువతిని తన ఇంటికి అహ్వాహించాడు సదరు వ్యక్తి.. ఇంట్లోకి రాగానే తన భార్య ఇప్పుడే గొడవపడి బయటకు వెళ్లిందని కాకమ్మకబుర్లు చెప్పాడు. కొద్దీ సేపటితర్వాత అతిధి మర్యాదగా యువతికి టీ ఇచ్చాడు. ఆ టీ తాగిన యువతి  మత్తులోకి జారుకోగానే ఆమెపై అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆ దృశ్యాలను తన ఫోన్ లో బంధించాడు. మెలుకువ వచ్చి విషయం తెలుసుకున్న యువతి  పారిపోవడానికి ప్రయత్నించింది. తన గురుంచి బయటికి చెప్తే తన నగ్న వీడియోలోను  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన యువతి బాధతో ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీడియోను అడ్డంపెట్టుకొని అనేక సార్లు యువతిపై లైంగికదాడి చేశాడు.

కొన్నిసార్లు మళ్లీ వీడియో తీసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇక ఈ వేధింపులు తట్టుకోలేని యువతి  మొత్తం విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వారి సాయంతో పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేసింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుండి ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ లో యువతితో పాటు మరికొంతమంది యువతుల వీడియోలను చూసి షాక్ అయ్యారు. ఈ దారుణ ఘటన ముంబై మహానగరంలో వెలుగుచూసింది