TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

Published on: Thu Jun 8, 2023 9:19AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

బుధవారం (జూన్ 7) తిరుమల శ్రీవారిని 75వేల 229 మంది భక్తుల దర్శించుకున్నారు. 35వేల 618 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం 3.24 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక గురువారం (జూన్8) ఉదయం నుంచీ 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు.