TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బస్సు లోయలో పడి 23 మంది మృతి

Published on: Thu Aug 21, 2014 2:25PM

 

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోర దుర్ఘటన జరిగింది. 40 మంది ప్రయాణికులతో వున్న బస్సు 4 వందల అడుగుల లోతు వున్న లోయలో పడిపోవడంతో 23 మంది ప్రయాణికులు మరణించారు. మరో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కన్నౌర్ జిల్లాలో సంగ్లా నుంచి కల్పా వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా మరణించారు. రెండు నెలల క్రితం హిమాచల్‌ ప్రదేశ్‌లోనే బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 56 మంది మరణించారు.