లాక్ డౌన్ తో లక్ కలిసి వచ్చిన కంపెనీలు

ఇకామర్స్, గేమింగ్ , ఫార్మా, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలదే హవా..
వంద కంపెనీల జాబితాలో 22 కంపెనీలు చైనావే..
370 బిలియన్ డాలర్ల  లాభాలు అందుకున్న చైనా కంపెనీలు..

ప్రపంచాన్ని అతలాకుతలం చేసి ప్రజా జీవితాన్ని యుటర్న్ తీసుకునేలా చేసిన కోవిడ్ వైరస్ 19 వ్యాప్తి కారణంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచమంత ఇంటికే పరిమితమయ్యారు. లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలు అతలాకుతలం అయిపోయాయి. కానీ కొన్ని రంగాల్లో మాత్రం బిలియన్ డాలర్ల మార్కెటింగ్ జరిగింది. అంతేస్థాయిలో లాభాలు ఆర్జించాయి. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ తో కొన్ని కంపెనీలకు లక్ కలిసొచ్చింది.  చాలా కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడం, ఆన్ లైన్ మీటింగ్స్, విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్లు, వీడియో గేమ్స్, మూవీస్, షాపింగ్ ఇలా అన్ని అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులను, సాఫ్ట్ వేర్ ను అందించిన కంపెనీలు బిలియన్ డాలర్లలో లాభాలను అందుకున్నాయి.

ఇకామర్స్ , గేమింగ్ , ఫార్మా, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలదే హవా కనిపిస్తోంది.
కరోనా కాలంలో అత్యధికంగా మన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి 100 కంపెనీల జాబితాను పరిశీలిస్తే అందులో ఇరవై రెండు కంపెనీలు చైనా వే కనిపిస్తాయి.

చైనాకు చెందిన టెన్సెంట్ గేమింగ్ కంపెనీ 93 బిలియన్ డాలర్ల మార్కెటింగ్తో ఐదోస్థానంలో నిలిచింది.  విండో ఆన్లైన్ షాపింగ్ కంపెనీ 52.2 బిలియన్ డాలర్ల మేరకు మార్కెటింగ్ చేసింది.  చైనాకు చెందిన మరో కంపెనీ అలీబాబా ఆన్లైన్ షాపింగ్,  హెల్త్ కేర్ ప్రాడక్ట్సతో మార్కెట్లో దూసుకుపోతుంది.  వైద్య పరికరాల కంపెనీలు,  ఫార్మా, ఫుడ్, ఆటోమొబైల్ పార్ట్స్ కంపెనీలు లాక్ డౌన్ టైమ్లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. అంతేకాదు ఎడ్యుకేషన్ ఆఫ్ ఆన్ ఎడ్యుకేషన్ టెక్నో కంపెనీలు కూడా లాభాలను ఆర్జించాయి. చైనాకు చెందిన ఇరవై రెండు కంపెనీలు దాదాపు 370 బిలియన్ డాలర్ల బిజినెస్ ను చేసినట్లుగా తెలుస్తోంది.

అత్యధిక లాభాలు ఆర్జించి నా జాబితాలో అమెజాన్ ముందు ఉంది. ఇంటికి పరిమితమైపోయిన ప్రజలు షాపింగ్ కోసం ఎక్కువగా ఈ సైట్ ను ఉపయోగించారు.  నాలుగు వందల 1.1 బిలియన్ డాలర్ల లాభాలను ఈ కంపెనీ ఆర్జించింది.  ఇక రెండో స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ 269.9 బిలియన్ డాలర్ల లాభాలతో ఉంది. వర్క్ ఫ్రొం హోమ్ పెరగడంతో  మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కు బాగా డిమాండ్ పెరిగింది. దాంతో ఈ కంపెనీ లాభాల బాట పట్టింది.

కరోనా లాక్ డౌన్ టైం లోనూ ఆపిల్  అమ్మకాలు బాగానే జరిగాయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 500 ఆపిల్ స్టోర్ లు మూసి వేసినప్పటికీ ఆన్లైన్ షాపింగ్ లో ఆపిల్ కొత్తగా రిలీజ్ చేసిన ఐ ఫోన్, ఐమాక్, మ్యాక్స బుక్ ఎయిర్ అమ్మకాలు బాగానే జరిగాయి. ఈ కంపెనీ 219 పాయింట్ వన్ బిలియన్ డాలర్ల లాభాలు నమోదు చేసింది.