TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏడాదిలో లక్షా 80 వేల కేసులు.. 2021లో పెరిగిన నేరాలు

Published on: Fri Dec 31, 2021 3:57PM

రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. హత్యలు, అత్యాచార ఘటనలు గతంలో కంటే ఎక్కువగా నమోదయ్యాయి. సైబర్ నేరాలు పెరిగాయ్. సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు కూడా పెరిగాయ్.. వార్షిక నేర నివేదిక 2021లో కీలక విషయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. డీజీపీ ఇచ్చిన నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాలు 4.6 శాతం మేర పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది లక్షా 80 వేల కేసులు నమోదయ్యాయి. అందులో లక్షా 32 వేల FIRలు నమోదయ్యాయి. 838 జీరో FIR కేసులున్నాయి. 

2021 సంవత్సరంలో  923 హత్యలు జరిగాయి 2,382 రేప్ కేసులు, 1,218 కిడ్నాప్, 16, 956 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి 17,058 మహిళలపై క్రైమ్ కేసులు నమోదయ్యాయి 2021 లో 17,429 దోపిడీ కేసులు నమోదయ్యాయి.. 113 కోట్ల దోపిడీ జరగగా 53 కోట్లు రికవరీ చేశారు.  8,828 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి 19,248 రోడ్ యాక్సిడెంట్స్ జరుగగా.. 6,690 మంది ప్రాణాలు కోల్పోయారు. మోటార్ వెహికల్ యాక్ట్ కింద 2 కోట్ల 22 లక్షల 55 వేల కేసులు నమోదు చేశారు.  ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 877 కోట్ల జరిమానాలు వేశారు. 2021 లో 4 లక్షల 80 వేల పెటీ కేసులు వచ్చాయి.రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల 51 వేల సీసీ కెమెరాలున్నాయి. ఈ సంవత్సరం లక్షా 86 వేల కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 

నేరాల్లో నిందితులకు శిక్షపడిన కేసులు 50.3 శాతమని చెప్పారు డీజీపీ మహేందర్ రెడ్డి. 80 కేసుల్లో 126 మందికి జీవిత ఖైదు పడిందని తెలిపారు మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉండాలన్న ప్రభుత్వ సూచనలను సమర్థంగా అమలు చేశామన్నారు డీజీపీ.  ఇప్పటిదాకా 98 మంది నక్సలైట్లను అరెస్ట్ చేశామని, మరో 133 మంది లొంగిపోయారని పేర్కొన్నారు. నక్సలైట్ల నుండి 8 ఆయుధాలు, లక్ష 26 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రజల సహకారంతో రాష్ట్రంలో ఎక్కడా మత ఘర్షణలు జరగలేదని, ఒక్క నిర్మల్ జిల్లా భైంసాలోనే చిన్న గొడవలు జరిగాయని తెలిపారు. ఈ ఏడాది 8,828 సైబర్ నేరాలు నమోదైనట్టు డీజీపీ చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో 6,690 మంది చనిపోయారన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రూ.879 కోట్ల జరిమానా వేశామని డీజీపీ వెల్లడించారు.

ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు సోషల్ మీడియా ద్వారా చేరువయ్యామని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. డయల్ 100కు ఈ ఏడాది 11.24 లక్షల ఫిర్యాదులు వచ్చాయన్నారు. హైదరాబాద్ సిటీలో ఫిర్యాదు వచ్చిన ఐదు నిమిషాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారన్నారు. పేద, ధనిక తేడా లేకుండా పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారి కోసం 800 స్టేషన్లలో రిసెప్షన్లను ఏర్పాటు చేశామన్నారు. షీ టీమ్స్ కు 5,145 ఫిర్యాదులు వచ్చాయని, బాధితులకు భరోసా కల్పించాయని తెలిపారు. హాక్ ఐ ద్వారా 83 వేలకు పైగా కేసులు నమోదు చేశామన్నారు. కేసులు పెట్టినా తరచూ నేరాలకు పాల్పడుతున్న 664 మందిపై పీడీ యాక్ట్ పెట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8.5 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.కరోనా కష్ట కాలంలో పోలుసులు శక్తి వంచన లేకుండా పని చేశారని చెప్పారు మహేందర్ రెడ్డి.