TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మిస్ యూనివర్స్ రన్నరప్ గా  ఇండియా భామ.. ఇదిగో బొమ్మ.. 

Published on: Mon May 24, 2021 11:54AM

పోటీలు అనేది  ఏ ఎక్సమ్ లోనో,  గేమ్స్ లోనో .. ఏ ప్రభుత్వ పోటీపరీక్షలలోనో మాత్రమే కాదు. ఒక మనిషి అందానికి కూడా పోటీలు ఉంటాయి. ఆ విషయం అందరికి తెలిసిందే.. అయితే  ఈ అపురూప అందాల తారలకు ప్రతి సంవత్సరం జరిగే మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహిస్తారు.ఆ విషయం కూడా అందరికి తెలిసిందే.. అయితే తాజాగా  మిస్ యూనివర్స్ 2020-21 పోటీలు మే 16న ఫ్లోరిడాలో జరిగాయి. ఈసారి మెక్సికో బ్యూటీ ఆండ్రియా మెజా కిరీటాన్ని దక్కించుకుంది. అయితే... మిస్ ఇండియా 24 ఏళ్ల అడెలిన్ కాస్టెలినో... ఈ పోటీల్లో టాప్ 4లో నిలిచింది. ఫలితంగా మూడో రన్నరప్ అయ్యింది. 74 మంది అమ్మాయిలతో పోటీ పడి... టాప్ 4లో నిలవడం ఈజీ కాదు. ఆమె టాలెంట్ గుర్తించిన శ్రీలంక ఆర్టిస్ట్... అచ్చం ఆమె లాంటి బొమ్మను తయారుచేశాడు. ఆ బ్యూటీ పేజెంట్‌లో కాస్టెలినో... వేసుకున్న శారీ కాస్టూమ్‌ ఆధారంగా ఈ బొమ్మను తయారుచేశాడు. ఆ పోటీల్లో కాస్టెలినో పింక్ శారీ ధరించింది. ఇండియాలో కమలం పువ్వును ఆమె ఆదర్శంగా తీసుకుంది. పింక్ కలర్ కమలం పువ్వును గుర్తు చేస్తూ... ఆ కాస్ట్యూమ్ వేసుకుంది.

అదే పింక్ కలర్ కాస్ట్యూమ్‌తో బొమ్మను తయారుచేసి... ఇన్‌స్టాగ్రామ్‌లోని నైగీడాల్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు ఆర్టిస్ట్. కాస్టెలినోకి శుభాకాంక్షలు తెలిపిన ఆర్టిస్ట్... శ్రీలంక నుంచి అభిమానిస్తున్నట్లు తెలిపాడు. "ఈ కాస్ట్యూమ్ భారతీయ మహిళను గుర్తుచేస్తోంది. ఈ శారీ సంప్రదాయకమైనది. ఇది మొత్తం దేశాన్ని ఐక్యం చేస్తుంది. దీని రంగు... జాతీయ పుష్పాన్ని గుర్తుచేస్తోంది" అని తెలిపాడు. ఇప్ప్పుడు శ్రీలంక ఆర్టిస్ట్ గీసిన ఈ మిస్ ఇండియా బొమ్మ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.