టీడీపీతో పొత్తు గురించి పవన్ ఏమన్నాడంటే

2019 ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు.. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో ఇంకా తేలలేదు.. ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్న వారు.. దానిని కొనసాగిస్తారా లేక కొత్తవారిని వెతుక్కుంటారా..? ఇలా సవాలక్ష ప్రశ్నలు తెలుగునాట ఎంతోమంది మెదళ్లను తొలిచేస్తున్నాయి. వాటిలో ఒకటి జనసేన-టీడీపీ ఫ్రెండ్స్‌ షిప్. 2014లో టీడీపీతో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో క్రియాశీలక పాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరి రాబోయే రోజుల్లో టీడీపీతో కలిసి పనిచేస్తారా..? లేదా అన్న ప్రశ్నకు అనంతపురం పర్యటనలో ఉన్న పవన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తన పార్టీ ప్రజాభిష్టం మేరకు ముందుకు సాగుతుందని చెప్పిన ఆయన.. ఎన్నికల సమయంలోనే పొత్తుల గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉందికదా..? అని ప్రశ్నించిన పవన్.. ఏదైనా పొత్తు గురించి ఆలోచించే సమయంలో ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటానని తెలిపారు. చంద్రబాబుతో సహా ఎవరితోనూ తనకు విభేదాలు లేవని చెప్పారు. అమరావతిలో తమ పాత్ర లేకుండా పోయిందని రాయలసీమ వాసులు అనుకుంటున్నారని.. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆయన సూచించారు.