TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

2014 అడుగుల జాతీయ పతాకం

Published on: Thu Aug 14, 2014 11:24AM

 

2014 సంవత్సరంలో 68వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని శుక్రవారం జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ స్కూలు విద్యార్థులు 2014 అడుగుల జాతీయ పతాకాన్ని రూపొందించారు. ఈ జాతీయ పతాకాన్ని గురువారం నాడు హైదరాబాద్‌లోని టాంక్ బండ్ మీద ఆవిష్కరించారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ పతాకాన్ని ట్యాంక్ బండ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు విద్యార్థులు పట్టుకుని నడిచారు. ఈ సందర్భంగా భారత మాతాకీ జై.. బోలో స్వతంత్ర భారత్‌కీ జై అంటూ విద్యార్థినీ విద్యా్ర్థులు నినాదాలు చేశారు.