ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్.. మరో ఇద్దరిపై వేటు
Published on: Mon Jan 18, 2016 2:19PM

2013 ఐపీఎల్ మ్యాచ్ లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో గతంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్లతో మరో ఆటగాడు అజిత్ చండీలాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు ఆటగాళ్లపై వేటు పడింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై బీసీసీఐ శశాంక్ మనోహర్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల బృందం ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే బీసీసీఐ శ్రీశాంత్, చవాన్లపై జీవితకాలం నిషేధం విధించగా ఇప్పుడు ఈ కమిటీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. స్పాట్ ఫిక్స్ంగ్ చేసినందుకు గాను అజిత్ చండీలాపై జీవితకాలం, హీకెన్ షాపై ఐదేళ్ల చొప్పున బీసీసీఐ నిషేధం విధించింది.


