TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జీసస్ కే పరీక్ష పెట్టిన విద్యార్ధి !

Published on: Sat Apr 14, 2012 12:40PM

విద్యార్దుల ప్రశ్నా పత్రాలను దిద్దే ఉపాధ్యాయులకు వింత వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. పరిక్షలు సరిగా రాయలేని వారు తమకు పాస్ మార్కులు వేయవలసిందిగా ఉపాధ్యాయులు వేడుకోవడం సహజమే. అయితే ఇటివల జరిగిన ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలో ఒక అభ్యర్ది ఏకంగా జీసస్ కే పరీక్షా పెట్టాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఫస్ట్ పేపర్ పరీక్షా రాసిన విద్యార్ది జవాబు పత్రంలో ఒక్క లెక్కకు మాత్రమే సమాధానం రాశాడు. అయితే చక్కటి దస్తూరితో, రంగురంగుల పెన్నులతో జీసస్ కు సుదీర్ఘ లేఖ మాత్రం రాశాడు. బైబిల్లో కోట్ చేసిన పదాలను తన జవాబు పత్రంలో వ్రాస్తు దేవాది దేవుడైన నిన్ను నేను పూర్తిగా నమ్ముకున్నాను. ఈ పరీక్షలో నన్ను కాపాడవలసిన బాద్యత నిదే ..నాకు 38 మార్కులు వచ్చేలా చేయి..... అంతకన్నా ఎక్కువ వద్దు.... అంతకన్నా తక్కువ వద్దు...నా కోర్కె తిర్చినచో నేను నీకు మరింత విశ్వాసపాత్రుడుగా ఉంటాను....అని ముగించాడు. స్క్తెచ్ పెన్నులతో జీసస్ బొమ్మను చక్కగా గిశాడు. ఈ జవాబు పత్రాన్ని చూసి స్పాట్ వేల్యూవేషాన్ కు వచ్చిన ఉపాధ్యాయులు ఖంగు తిన్నారు. ఇతను రాసిన ఒకే ఒక్క జవాబు కేవలం రెండు మార్కులు వచ్చాయి. తనకు 38 మార్కులు ఇవ్వాలంటూ జీసస్ కే పరీక్షా పెట్టిన ఈ ఘనుడు నిర్వాకం చూసి స్పాట్ వేల్యూ వేషాన్కు వచ్చిన ఉపాద్యాయులు కడుపుబ్బా నవ్వుకున్నారు.