TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జనసేనలో చేరడానికి 20 మంది ఎమ్మెల్యేలు సిద్ధం.!!

Published on: Sat Aug 25, 2018 10:52AM

 

జనసేనలో పవన్ కళ్యాణ్ బ్రాండ్ తప్ప వేరే ముఖ్యనేతలు ఎవరూ లేరని అందరూ అభిప్రాయపడుతుంటారు.. అయితే త్వరలో జనసేనకు ఆ లోటు తీరబోతుందట.. పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు జనసేన తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారట.. తాజాగా జనసేన రాష్ట్ర కన్వీనర్‌ వి.పార్థసారథి రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. ఆంధ్రప్రదేశ్‌లో 20 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికే వారంతా పవన్‌ కల్యాణ్‌తో చర్చించారు.. ఆయన నిర్ణయం తీసుకున్నాక తేదీ ఖరారు చేసి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తాం అన్నారు.. అంతేకాదు వివిధ పార్టీల నుంచి పలువురు ముఖ్య నేతలు కూడా జనసేనలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.. పార్టీలో కొత్త తరానికి 60 శాతం సీట్లు ఇస్తామని.. పాత, కొత్త తరం కలయికలతో పార్టీ సమర్థంగా నడుస్తుందన్న నమ్మకం తమకుందని చెప్పారు.. మరి 20 మంది ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నేతలు ఎవరో భవిష్యత్తులో చూద్దాం.